Arjun Reddy Heroine got more chances now.

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి మూవీ తో హీరోయిన్ గా తెలుగు స్క్రీన్ కు పరిచయమైన షాలిని పాండే..మొదటి చిత్రం తోనే తన నటన తో అందర్నీ మాయ చేసింది. యూత్ కైతే ఇమె పిచ్చపిచ్చగా నచ్చేసింది..ప్రస్తుతం ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే మహానటి , ‘100% లవ్‌’ తమిళ్‌ రీమేక్‌లో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ కు తాజాగా మరో ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు షాలినిని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కి ఆమె ఒకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఓ రోడ్డు ట్రిప్‌ చుట్టూ సాగే కథ అని తెలుస్తుంది.. ఈ చిత్రంలో ఇద్దరు, ముగ్గరు హీరోయిన్లు ఉండబోతారట. రా కార్తిక్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జె. సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధీన్‌ దయాల్‌ బాణీలు మ్యూజిక్ అందిస్తున్నాడు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *